Corona in TS: తెలంగాణలో మళ్లీ 500కి పైగా కేసులు, గత 24 గంటల్లో 581 మందికి కోవిడ్, అత్యధికంగా హైదరాబాదులో 227 కొత్త కేసులు

గడచిన 24 గంటల్లో 28,306 శాంపిల్స్ పరీక్షించగా, 581 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 227 కొత్త కేసులు నమోదయ్యాయి.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

తెలంగాణలో కరోనా రోజువారీ కేసులు 500కి పైబడి నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 28,306 శాంపిల్స్ పరీక్షించగా, 581 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 227 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 45, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 40, పెద్దపల్లి జిల్లాలో 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 26, మంచిర్యాల జిల్లాలో 24, నల్గొండ జిల్లాలో 22, ఖమ్మం జిల్లాలో 20 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 645 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదుకాలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,14,884 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,06,207 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,566 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

Telangana Logs 581 New Covid Cases in Last 24 hours

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)