Covid in Telangana: తెలంగాణలో కొత్తగా 748 మందికి కోవిడ్, జీహెచ్ఎంసీ పరిధిలో 121 మందికి కరోనా, తాజాగా 1,492 మంది కరోనా నుంచి క్షేమంగా ఇంటికి, రాష్ట్రంలో ప్రస్తుతం 14,302 యాక్టివ్ కేసులు

COVID Outbreak - Representational Image (Photo-PTI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 81,405 కరోనా పరీక్షలు నిర్వహించగా, 748 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 121 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 1,492 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,20,613 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,02,676 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,302 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో మొత్తం 3,635 మంది మరణించారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 97.10 శాతానికి పెరిగింది.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement