KTR Father-in-Law Dies: తండ్రిని కోల్పోయిన కోడలు శైలిమను ఓదార్చిన సీఎం కేసీఆర్, కేటీఆర్ మామ పాకాల హరినాథరావు మృతి పట్ల సంతాపం తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
తన వియ్యంకుడు, మంత్రి కె. తారకరామారావు మామ పాకాల హరినాథరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం వద్ద గల వారి నివాసానికి వెళ్ళి దివంగత హరినాథరావు భౌతిక కాయానికి సీఎం నివాళులర్పించారు.
తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ (Minister KTR) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సీఎం కేసీఆర్ వియ్యంకుడు, కేటీఆర్ మామ పాకాల హరినాథరావు (Pakala Harinatha rao) గుండెపోటుతో గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. హరినాథరావు (Pakala Harinatha rao) కు మంగళవారం మధ్యాహ్నం 2.44 నిమిషాలకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రికి తరలించారు. కాగా ఆరోగ్యం మరింత విషమించడంతో గురువారం 1.10 నిమిషాలకు పాకాల హరినాథరావు (Pakala Harinatha rao) మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
తన వియ్యంకుడు, మంత్రి కె. తారకరామారావు మామ పాకాల హరినాథరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం వద్ద గల వారి నివాసానికి వెళ్ళి దివంగత హరినాథరావు భౌతిక కాయానికి సీఎం నివాళులర్పించారు.తండ్రిని పోగొట్టుకున్న దుఃఖంతో ఉన్న తమ కోడలు శైలిమను, శోకతప్తులైన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి దంపతులు ఓదార్చారు. హరినాథరావు ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ భగవంతున్ని ప్రార్థించారు.
Here's TS CMO Tweet