TRS Minister Mallareddy Dance Video: డ్యాన్సుతో అదరగొట్టిన టీఆర్ఎస్ మంత్రి మ‌ల్లారెడ్డి, సోషల్ మీడియాలో వీడియో వైరల్

వ‌య‌సు మీద ప‌డుతున్నా.. కుర్రాడికి మ‌ల్లే మ‌ల్లారెడ్డి ఈ వీడియోలో స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసేశారు.

TRS Minister Mallareddy Dance Video (Photo-Video Grab)

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డి కారు రూఫ్ టాప్‌లో నిల‌బ‌డి అదిరేటి రీతిలో స్టెప్పులేసిన మ‌ల్లారెడ్డి వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ చక్క‌ర్లు కొడుతోంది. వ‌య‌సు మీద ప‌డుతున్నా.. కుర్రాడికి మ‌ల్లే మ‌ల్లారెడ్డి ఈ వీడియోలో స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసేశారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో అధికార టీఆర్ఎస్ శ‌నివారం మునుగోడులో ప్ర‌జా దీవెన స‌భ పేరిట భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌భ‌కు రోడ్డు మార్గం మీదుగా సీఎం కేసీఆర్ వేలాది కార్ల‌తో కూడిన భారీ కాన్వాయ్‌తో హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరారు. ఈ ర్యాలీలో మ‌ల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయ‌న త‌న కారు రూఫ్ టాప్‌పై నిల‌బ‌డి డ్యాన్సులేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)