MLA Medipalli Satyam: కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు బెదిరింపు కాల్, రూ. 20 లక్షలు డిమాండ్ చేసిన ఓ వ్యక్తి, లండన్‌ నుండి ఫోన్..లుక్ ఔట్ నోటీసులు జారీ

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఫోన్ లో బెదిరించి, 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత సెప్టెంబర్ నెలలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సప్ కాల్ అందుకున్నారు ఎమ్మెల్యే సత్యం. తనకు 20 లక్షలు ఇవ్వకపోతే అప్రతిష్ఠపాలు చేస్తానని, నిన్ను చంపి నీ పిల్లలను అనాధలను చేస్తానంటూ హెచ్చరించారు.

Telangana MLA Medipalli Satyam receives threat call(X)

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఫోన్ లో బెదిరించి, 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత సెప్టెంబర్ నెలలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సప్ కాల్ అందుకున్నారు ఎమ్మెల్యే సత్యం. తనకు 20 లక్షలు ఇవ్వకపోతే అప్రతిష్ఠపాలు చేస్తానని, నిన్ను చంపి నీ పిల్లలను అనాధలను చేస్తానంటూ హెచ్చరించారు.

దీంతో కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే సత్యం. నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ లోని భవానీనగర్ కు చెందిన 33 ఏళ్ల యాస అఖిలేష్ రెడ్డిగా గుర్తించగా ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. దీంతో నిందితుడిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్టు ప్రెస్ నోట్ ద్వారా పోలీసులు వెల్లడించారు.  బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య డ్రగ్స్ టెస్ట్ యుద్ధం, డ్రగ్స్ టెస్టులకు శాంపిల్స్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు...బీఆర్ఎస్ నేతలకు సవాల్ 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now