Telangana: హోలీ రోజు తీవ్ర విషాదం, వార్దా నదిలో ఈతకు వెల్లి నలుగురు యువకులు మృతి, డెడ్ బాడీలను వెలికి తీసిన జాలర్లు
నదిలో స్నానికి వెళ్లిన నలుగురు యువకులు నీట మునిగి చనిపోయారు(Death of four youths). జాలర్లు మృతదేహాలను వెలికి తీశారు.
హోలీ పండుగపూట కుమ్రంభీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నదిలో స్నానికి వెళ్లిన నలుగురు యువకులు నీట మునిగి చనిపోయారు(Death of four youths). జాలర్లు మృతదేహాలను వెలికి తీశారు. జిల్లాలోని కౌటాల మండలం నదిమాబాద్ గ్రామానికి చెందిన సంతోష్, ప్రవీణ్ సాయి, కమలాకర్ అనే నలుగురు యువకులు హోలీ(Holi ) ఆడిన అనంతరం కౌటాల మండలం తాటిపల్లి వద్ద వార్ధా నదిలో(Wardha river) స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. కృష్ణాజిల్లా మున్నేరు వాగులో విషాదం, ఐదుగురు పిల్లలు గల్లంతు, నాలుగు మృతదేహాలు లభ్యం, కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
గమనించిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికి ఫలితం లేకపోయింది. నలుగురు నీటిలో మునిగి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను కౌటాల ఆస్పత్రికి తరలించారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)