Image used for representational purpose only | File Photo

Krishna, Jan 11: ఏపీలో కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏలూరు గ్రామంలో విషాదం (Munneru River Tragedy) చోటుచేసుకుంది. ఏటూరు వద్ద మున్నేరు వాగులో ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన 8 నుంచి 13 ఏళ్ల మధ్య వయసు కలిగిన ఐదుగురు పిల్లలు (Five students feared drowned) మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి మున్నేరు వైపు వెళ్లారు. రాత్రి అవుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళనలతో ఉన్న తల్లిదండ్రులు.. వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

పిల్లల బట్టలు, వారి సైకిళ్లు మున్నేరు ఒడ్డున ఉండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. గల్లంతైన వారు చరణ్, బాల యేసు, అజయ్, రాకేష్, సనిగా పోలీసులు గుర్తించారు. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు సంఘటనా ప్రాంతానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మున్నేరులోకి నాటు పడవలను పంపించి పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. రాత్రి కావడంతో చీకట్లో వెతుకులాటకు ఇబ్బంది అవుతుంది.

ఏపీలో నైట్‌ కర్ఫ్యూ, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు, మాస్క్‌ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు

కృష్ణా జిల్లాలో మున్నేరు వాగులో గల్లంతయిన ఐదుగురు విద్యార్థులమృతదేహాలు లభ్యమయ్యాయి.చరణ్, బాలయేసు, అజయ్, సన్నీ, రాకేష్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.