Telangana: తెలంగాణలో తప్పిన ఘోర ప్రమాదం, కుప్పకూలిన పెద్దవాగుపై బ్రిడ్జి, వంతెనపై రాకపోకలను నిలిపివేసిన అధికారులు

కాగజ్‌నగర్‌ మండలం అందెవెళ్లి వద్ద పెద్దవాగుపై (Peddavagu) ఉన్న వంతెన కూలిపోయింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పినట్లయింది. గతేడాది కురిసిన వానలకు వంతెన కొద్దిగా కుంగిపోయింది.

Peddavagu Bridge Collapsed (Photo-Video Grab)

తెలంగాణలోని కుమ్రం భీమ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. కాగజ్‌నగర్‌ మండలం అందెవెళ్లి వద్ద పెద్దవాగుపై (Peddavagu) ఉన్న వంతెన కూలిపోయింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పినట్లయింది. గతేడాది కురిసిన వానలకు వంతెన కొద్దిగా కుంగిపోయింది. అయితే కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు పెద్దవాగులో వరద ప్రవాహం పెరిగింది. దీంతో వరద తాకిడికి బుధవారం తెల్లవారుజామన బ్రిడ్జి కూలిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులు బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. రహదారికి అడ్డంగా రెండువైపులు బారికేడ్లు పెట్టారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)