PM Modi Sangareddy Visit: సంగారెడ్డిలో రూ. 7 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, వీడియో ఇదిగో..
నేడు సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO) కేంద్రాన్ని మంగళవారం, మార్చి 5, 2024 నాడు జాతికి అంకితం చేశారు.
తెలంగాణలో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. నేడు సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO) కేంద్రాన్ని మంగళవారం, మార్చి 5, 2024 నాడు జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో PM మోడీ మాట్లాడుతూ, “గత 10 ఏళ్ళలో తెలంగాణను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి కృషి చేస్తోంది. నిన్న ఆదిలాబాద్ నుంచి రూ.56 వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశాను. ఈరోజు సంగారెడ్డిలో రూ. 7 వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నాను అని అన్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)