COVID in TS: తెలంగాణలో కొత్తగా 2.850 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 859 కొత్త కేసులు
రాష్ట్రంలో మంగళవారం 94,020 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 2,850 మంది వైరస్ బారినపడ్డారు. పాజిటివిటీ రేటు 3.03 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.66 లక్షలకు చేరింది. తాజాగా 4,391 మంది కోలుకోగా, మొత్తం 7.27 లక్షల మంది రికవరీ అయ్యారు
రాష్ట్రంలో మంగళవారం 94,020 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 2,850 మంది వైరస్ బారినపడ్డారు. పాజిటివిటీ రేటు 3.03 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.66 లక్షలకు చేరింది. తాజాగా 4,391 మంది కోలుకోగా, మొత్తం 7.27 లక్షల మంది రికవరీ అయ్యారు. ఒక్కరోజులో కరోనాతో ఇద్దరు చనిపోగా, ఇప్పటివరకు వైరస్‌కు 4,091 మంది బలయ్యారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 859 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 173, రంగారెడ్డి జిల్లాలో 157, సిద్ధిపేట జిల్లాలో 101 కేసులు వెల్లడయ్యాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)