Coronavirus in TS: తెలంగాణలో కొత్తగా 3,043 మందికి కరోనా పాజిటివ్, అత్యధికంగా జీహెచ్ఎంసీలో 424 కొత్త కేసులు నమోదు, తాజాగా 4,693 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 59,709 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,043 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 424 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 17 కేసులు గుర్తించారు.

Coronavirus-in-India ( photo-PTI)

అదే సమయంలో 4,693 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, 21 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,56,320 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,13,968 మంది కరోనాను జయించారు. ఇంకా 39,206 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,146కి పెరిగింది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు మరికాస్త పెరిగి 92.38 శాతంగా నమోదైంది.

Here's Covid in TS report

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement