Covid in TS: తెలంగాణలో 3 వేలు దాటిన యాక్టివ్ కేసులు, గత 24 గంటల్లో 496 మందికి పాజిటివ్ గా నిర్ధారణ,హైదరాబాదులో అత్యధికంగా 341 కొత్త కేసులు
తెలంగాణలో గత కొన్నిరోజులుగా 400కి పైగా రోజువారీ కేసులు నమోదవుతుండగా, రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేలు దాటింది. గడచిన 24 గంటల్లో 28,808 కరోనా పరీక్షలు నిర్వహించగా, 496 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 341 కొత్త కేసులు వెల్లడయ్యాయి
తెలంగాణలో గత కొన్నిరోజులుగా 400కి పైగా రోజువారీ కేసులు నమోదవుతుండగా, రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేలు దాటింది. గడచిన 24 గంటల్లో 28,808 కరోనా పరీక్షలు నిర్వహించగా, 496 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 341 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 68, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 40, సంగారెడ్డి జిల్లాలో 15 కేసులు గుర్తించారు. అదే సమయంలో 205 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,98,621 మంది కరోనా బారినపడగా, వారిలో 7,90,897 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,613 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement