TS Covid: తెలంగాణలో కొత్త‌గా 535 కరోనా కేసులు, ముగ్గురు మృతితో 1,688కు చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య, జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 154 మందికి క‌రోనా, రాష్ట్రంలో 4,495 యాక్టివ్ కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 535 కరోనా కేసులు (New Covid Cases) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ముగ్గురు ప్రాణాలు (Covid Deaths) కోల్పోయారు. అదే సమయంలో 278 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,339కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,00,156 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,688గా ఉంది.

Coronavirus in India (Photo-PTI)

తెలంగాణలో ప్రస్తుతం 4,495 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,979 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 154 మందికి క‌రోనా సోకింది.

TS Covid Updates:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement