COVID in TS: తెలంగాణలో కొత్తగా 614 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 131 కొత్త కేసులు నమోదు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,520 కరోనా పరీక్షలు నిర్వహించగా, 614 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 131 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 48, రంగారెడ్డి జిల్లాలో 43, ఖమ్మం జిల్లాలో 33 కేసులు వెల్లడయ్యాయి.

Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,520 కరోనా పరీక్షలు నిర్వహించగా, 614 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 131 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 48, రంగారెడ్డి జిల్లాలో 43, ఖమ్మం జిల్లాలో 33 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 2,387 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజులో రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,84,062 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,70,047 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,908 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 98.21 శాతంగా ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement