Nalgonda Road Accident: వీడియో ఇదిగో, పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదాలు, నల్గొండ జిల్లాలో ఆరుమంది మృతి

నల్గొండ జిల్లాలో పొగమంచు కారణంగా 2 రోడ్డుప్రమాదాలు.. ఒకే కుటుంబం వారు 5 మంది మృతి. వేంపాడు వద్ద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్‌తో ఢీకొట్టిన కేశవులు.. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. కేశవులు కుటుంబ సభ్యులు అతనిని చూడటానికి టాటా ఏస్‌ వాహనంలో వెళ్తుండగా ఆ వాహనాన్ని ఢీకొట్టిన ట్యాంకర్.. ప్రమాదంలో కేశవులు కుటుంబసభ్యులు 4 మరణించారు.

Nalgonda Road Accident

రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యుడు చనిపోయాడని తెలిసి ఆటోలో బయలుదేరిన కుటుంబ సభ్యులు కూడా ప్రమాదానికి గురయ్యారు. రెండు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందగా.. చావుబతుకుల్లో ఉన్న మరో ముగ్గురిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుందీ విషాదం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పెద్దవూర మండలం నిమ్మానాయక్ తండాకు చెందిన కేశవులు (28) ఆదివారం రాత్రి మిర్యాలగూడ నుంచి పెద్దవూరకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నిమ్మనూరులోని వేంపాడు దగ్గర్లో సైదులు అనే పెద్దాయనను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సైదులు, కేశవులు ఇద్దరూ చనిపోయారు. కేశవులు మృతి వార్త తెలిసి ఆయన కుటుంబం కన్నీటిపర్యంతమైంది. ప్రమాదం జరిగిన చోటుకు టాటా ఏస్ వాహనంలో కేశవులు కుటుంబ సభ్యులు ఏడుగురు బయలుదేరారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now