Telangana Road Accident: పండుగ వేళ దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలో నలుగురు అక్కడికక్కడే మృతి
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా కంబాలపల్లి శివారులో కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా కంబాలపల్లి శివారులో కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. మృతులు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
ఓ కుటంబం నాగార్జునసాగర్ సమీపంలోని బుడియా బాపు దేవుడిని సందర్శించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నారు. అదే జిల్లాకు చెందిన మరో కుటుంబం గుంజేడులోని ముసలమ్మ దేవతను సందర్శించుకుని కారులో తిరిగి వస్తున్నారు. ఇంతలో కంబాలపల్లి శివారుకు చేరుకోగానే కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇస్లావత్ శ్రీను(కొడుకు), పాప ( శ్రీను తల్లి ), రిత్విక్ ( శ్రీను కుమారుడు), రిత్విక ( శ్రీను కూతురు) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Here's News