Prophet Remark Row: పాతబస్తీలో ప్రశాంత వాతావరణం, రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో భద్రత ఏర్పాటు, ఓల్డ్ సిటీలో సాయంత్రం నుంచి ఆంక్షలు

బీజేపీ సస్పెండ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Rajasingh) వ్యాఖ్యలతో నిరసనలతో వేడెక్కిన పాతబస్తీ (Old city)లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆందోళనలు, నిరసనలు తగ్గాయి. చార్మినార్ (Charminar) వద్ద షాపులు తెరుచుకున్నాయి. రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో భద్రత ఏర్పాటు చేశారు.

Security at Charminar in Hyderabad (Photo-ANI)

బీజేపీ సస్పెండ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Rajasingh) వ్యాఖ్యలతో నిరసనలతో వేడెక్కిన పాతబస్తీ (Old city)లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆందోళనలు, నిరసనలు తగ్గాయి. చార్మినార్ (Charminar) వద్ద షాపులు తెరుచుకున్నాయి. రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో భద్రత ఏర్పాటు చేశారు. ఓల్డ్ సిటీ వ్యాప్తంగా షాపులు తెరుచుకున్నాయి. అయితే గురువారం కూడా ఓల్డ్ సిటీలో సాయంత్రం నుంచి ఆంక్షలు కొనసాగనున్నాయి.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ అరెస్టయి.. అంతలోనే బెయిల్‌పై బయటకు రావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంగళవారం ఉదయం రాజాసింగ్‌ అరెస్టుతో కాస్త శాంతించిన పరిస్థితి.. మంగళవారం రాత్రి నుంచి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువకులు మంగళవారం అర్ధరాత్రి నుంచి మళ్లీ చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించారు. రాజాసింగ్‌కు, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ... నల్ల జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా రాజాసింగ్‌ వ్యవహరిస్తున్నా.. పోలీసులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement