Telangana Shocker: వీడియో ఇదిగో, భార్య తిట్టిందని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త, జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన
జగిత్యాల జిల్లా కోరుట్లలో విషాదం చోటు చేసుకుంది. భార్య తిట్టిందని మనస్థాపం చెందిన ఓ భర్త బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోరుట్ల పట్టణానికి చెందిన నరేష్ అతని భార్యతో గతరాత్రి గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆమె నరేష్‌ను తిట్టింది.
జగిత్యాల జిల్లా కోరుట్లలో విషాదం చోటు చేసుకుంది. భార్య తిట్టిందని మనస్థాపం చెందిన ఓ భర్త బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోరుట్ల పట్టణానికి చెందిన నరేష్ అతని భార్యతో గతరాత్రి గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆమె నరేష్‌ను తిట్టింది. అందరి ముందు భార్య తిట్టడాన్ని జీర్ణించుకోలేని నరేష్.. చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అల్లమయ్యగుట్ట వద్ద గల బావి వద్దకు వెళ్లి అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.బావి యజమాని శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నరేష్ మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)