Telangana: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపిన స్విస్ రే కంపెనీ, కేటీఆర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చ
ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులు కేటీఆర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ ఆగస్టులో హైదరాబాద్‌లో స్విస్ రే కంపెనీ తమ కార్యకలాపాలను ప్రారంభించనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
160 ఏండ్ల నాటి బీమా సంస్థ స్విస్ రే కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులు కేటీఆర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ ఆగస్టులో హైదరాబాద్‌లో స్విస్ రే కంపెనీ తమ కార్యకలాపాలను ప్రారంభించనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఈ కంపెనీ 250 మందితో ప్రారంభం కానుందది. డాటా, డిజిటల్ కెపబిలిటీస్, ప్రొడక్ట్ మోడలింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్ పై దృష్టి సారించనుంది. ఈ సందర్భంగా స్విస్ రే కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్ కేంద్రంగా.. ప్రపంచంలోని 80 ప్రాంతాల్లో స్విస్ రే కంపెనీ తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)