Telangana: పెద్దపల్లి జిల్లాలో ఘోర విషాదం, రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి, ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్న అధికారులు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ నుంచి బెంగుళూరు వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు దుర్మరణం చెందారు. చీకురాయి, కొత్తపల్లి గ్రామాల మధ్య రైలు పట్టాలపై మరమత్తులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ నుంచి బెంగుళూరు వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు దుర్మరణం చెందారు. చీకురాయి, కొత్తపల్లి గ్రామాల మధ్య రైలు పట్టాలపై మరమత్తులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఒకరు పర్మినెంట్ ఉద్యోగి మొకద్దం దుర్గయ్య కాగా.. ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు శ్రీనివాస్, వేణుగా గుర్తించారు. రైల్వే ఉద్యోగుల మరణంతో బాధితుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)