Telangana Woman Murder Case: షాకింగ్ వీడియో ఇదిగో, మొయినాబాద్‌లో పట్టపగలే యువతిని చంపి కాల్చివేసిన దుండగులు, కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మంటల్లో కాలుతున్న యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పరిసరాలను పరిశీలించారు.
మొయినాబాద్‌లో పట్టపగలే యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మంటల్లో కాలుతున్న యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పరిసరాలను పరిశీలించారు. హత్యకు సంబంధించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. ఘటన స్థలంలో సగం కాలిపోయి దొరికిన సెల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం 80 శాతం కాలిన యువతి మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా మార్చరీలో ఉంచారు. వీడియో ఇదిగో.. బిర్యానీ తినేవాళ్లు ముందు ఈ వీడియో చూడండి, జూబ్లీహిల్స్ రెస్టారెంట్‌లో కస్టమర్లకు వడ్డించిన బిర్యానీలో చనిపోయిన బొద్దింక
సంఘటనా స్థలాన్ని చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి సందర్శించారు. క్లూస్‌టీం సహాయంతో వివరాలు సేకరిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. మూడు టీంలతో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. రాజేంద్రనగర్ జోన్ అదనపు డీసీపీ రష్మీపెరుమాల్ పర్యవేక్షిస్తున్నారు. నిందితులను సైతం పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు. ఈమేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Here's Disturbed Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)