Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆత్మహత్యాయత్నం, సూసైడ్ లెటర్ రాసి విషం తాగిన ఆరిజన్ పాల సంస్థ భాగస్వామి శేజల్
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బెల్లంపల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆరిజన్ పాల సంస్థ భాగస్వామి శేజల్ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సుసైడ్ లెటర్ రాశారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బెల్లంపల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆరిజన్ పాల సంస్థ భాగస్వామి శేజల్ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సుసైడ్ లెటర్ రాశారు. అందులో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయన అనుచరులు భీమా గౌడ్, సంతోష్, పోచన్న, కార్తీక్ మానసికంగా హింసిస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే చిన్నయ్య నన్ను చంపుతానని అనుచరులతో బెదిరిస్తున్నారు. ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న నా ఫోటోలను సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేశారంటూ లేఖలో పేర్కొన్నారు. నేను చనిపోయిన తర్వాతనైనా న్యాయం జరుగుతుందని సూసైడ్ లెటర్ రాస్తున్న’ అని లేఖలో పేర్కొన్నారు.ఎమ్మెల్యే చిన్నయ్యకు, అరిజిన్ డెయిరీ పాల సంస్థ ప్రతినిధులకు మధ్య గతంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)