Telangana: వీడియో ఇదిగో, సెల్ఫీ దిగుతూ కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడిన యువతి, తాళ్ల సాయంతో ఆమెను పైకి లాగి కాపాడిన స్థానికులు
సెల్ఫీ దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
నల్గొండ జిల్లాలో సెల్ఫీ మోజు ఓ యువతి ప్రాణాలమీదకు తెచ్చింది. సెల్ఫీ దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు మహిళను ప్రాణాలతో కాపాడారు. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళుతున్న ఓ కుటుంబం వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమకాలువ వద్ద ఆగింది. వీడియో ఇదిగో, నూరేళ్ల ఆయుష్షు ఈ తాగుబోతుకు, నడిరోడ్డు మీద కుర్చీలో కూర్చుని ఉండగా వెనక నుంచి ఢీకొట్టిన లారీ, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ మందుబాబు
అనంతరం ఆ కుటుంబం కాలువ వద్ద సెల్ఫీ దిగింది. ఈ క్రమంలో ఆ ఫ్యామిలీలోని ఓ మహిళ కాలు జారి కాలువలో పడిపోయింది. అది చూసిన స్థానికులు వెంటనే స్పందించి మహిళను తాళ్ల సాయంతో కాపాడారు. మహిళ సురక్షితంగా పైకి రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీంతో కొద్దిసేపు కాలువ వద్ద ఆందోళనకర వాతావరణం నెలకొంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)