Telangana Horror: షాకింగ్ వీడియో ఇదిగో, నడిరోడ్డుపై యువతిని గొడ్డలితో దారుణంగా నరికి చంపిన యువకుడు, ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు
నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ పట్టణంలో శివాజీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువతిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు.
నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ పట్టణంలో శివాజీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువతిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు.ఖానాపూర్ పట్టణంలోని అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన సీహెచ్ సోనీ అలియాస్ స్వీటీ (20).. టైలరింగ్ షాపు నుంచి ఇంటికి వెళ్తుండగా యువకుడు కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె వదిన, పక్కనే ఉన్న రెండేళ్ల చిన్నారిపైనా దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బాలుడి తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సీఐ మోహన్, ఎస్‌ఐ లింబాద్రి పరిశీలించారు.యువతిపై దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అలేఖ్యకు మరో యువకుడితో నెల క్రితం వివాహం నిశ్చయమైంది. దీనిని తట్టుకోలేక అలేఖ్యపై ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Here's Disturbed Video