YS Sharmila Arrest: కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా మౌన దీక్ష, షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు, బంగారు తెలంగాణలో డ్రగ్స్, మద్యం ఏరులై పారుతున్నాయని వైఎస్ఆర్టీపీ అధినేత్రి ఆరోపణలు

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ట్యాంక్ బండ్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయంటూ షర్మిల మౌనదీక్ష చేపట్టారు. ట్యాంక్ బండ్ పై రాణి రుద్రమదేవి విగ్రహం దగ్గర పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె దీక్షలో కూర్చున్నారు.

YS Sharmila Arrest (Photo-Twitter/YS Sharmila)

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ట్యాంక్ బండ్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయంటూ షర్మిల మౌనదీక్ష చేపట్టారు. ట్యాంక్ బండ్ పై రాణి రుద్రమదేవి విగ్రహం దగ్గర పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె దీక్షలో కూర్చున్నారు. నోటికి నల్ల గుడ్డ కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. బంగారు తెలంగాణలో డ్రగ్స్, మద్యం ఏరులై పారుతున్నాయని ఆమె ఆరోపించారు. దానివల్ల మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. అయితే, ఈ మౌన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. షర్మిలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now