JD Lakshminarayana on Barrelakka: బర్రెలక్క కుటుంబానికి వెంటనే రక్షణ కల్పించండి, తెలంగాణ డీజీపీని కోరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపిన సామాన్య యువతి బర్రెలక్క అలియాస్ శిరీష సోదరుడిపై దాడి కలకలం రేపిన సంగతి విదితమే. దీనిపై శిరీష సోదరుడిపై దాడిని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఖండించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

JD Lakshminarayana on Barrelakka (Photo-X)

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపిన సామాన్య యువతి బర్రెలక్క అలియాస్ శిరీష సోదరుడిపై దాడి కలకలం రేపిన సంగతి విదితమే. దీనిపై శిరీష సోదరుడిపై దాడిని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఖండించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. శిరీష సోదరుడిపై దాడి చేయడం అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శిరీష, ఆమె కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి, సిఈవో తెలంగాణను కోరుతూ ట్యాగ్ చేశారు.కాగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బర్రెలక్క పోటీలో నిలిచారు. ఇదిలా ఉంటే బర్రెలక్కకు మద్దతుగా రాష్ట్రం నలుమూలల నుంచి యువత తరలివస్తున్నారు.అలాగే దేశవ్యాప్తంగా పలువురు ఎన్నికల ప్రచారానికి ఖర్చులు సైతం పంపుతున్న సంగతి తెలిసిందే

JD Lakshminarayana on Barrelakka (Photo-X)

Here's Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement