TS Eamcet Results: మరికాసేపట్లో తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ విడుదల, ఫలితాలను ఎక్కడ చూసుకోవచ్చంటే!
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆమె ఉన్నతాధికారులతో కలిసి ఫలితాలను రిలీజ్ చేస్తారు.
Hyderabad, May 25: టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) (TS EAMCET) ఫలితాలను గురువారం ఉదయం 9:30 గంటలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి (Sabitha Indra reddy) విడుదల చేయనున్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆమె ఉన్నతాధికారులతో కలిసి ఫలితాలను రిలీజ్ చేస్తారు. వాస్తవానికి, ఫలితాలను ఉదయం 11 గంటలకు కూకట్‌పల్లి జేఎన్టీయూలో (JNTU) విడుదల చేయాల్సి ఉన్నది. అయితే, జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశంకానుండటం, దీనికి మంత్రి సబిత హాజరుకానున్న నేపథ్యంలో 9.30 గంటలకే ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఉదయం 9.45 గంటల తర్వాత ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)