Vaddepalli Krishna Dies: టాలీవుడ్‌లో విషాదం, ప్రముఖ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
టాలీవుడ్ లో విషాదం కర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
టాలీవుడ్ లో విషాదం కర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితమే తెలుగు సినీ రచయితల సంఘం ఆయనను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించడం గమనార్హం. ఈ సంతోషకర సమయంలో ఆయన కన్నుమూశారు.
తమిళ నటుడు బిజిలి రమేష్ కన్నుమూత, ప్రాంక్ వీడియోలతో ఫేమస్, కోలీవుడ్‌లో విషాదం
వడ్డేపల్లి కృష్ణ సిరిసిల్లలో చేనేత కుటుంబంలో జన్మించారు. తొలుత పోస్ట్ మేన్ గా ఉద్యోగం చేశారు. దర్శకుడిగా రెండు సినిమాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన 'ఎక్కడకి వెళుతుందో మనసు' సినిమాలో సాయికుమార్ హీరోగా నటించారు. 'బలగం' సినిమాలో వడ్డేపల్లి నటించారు. ఆయన రాసిన వందలాది లలితగీతాలు ఆకాశవాణి, దూరదర్శన్ లో ప్రసారమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా కృష్ణ చురుగ్గా పాల్గొన్నారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)