TS Weather Alert: తెలంగాణలో మూడు రోజులు వర్షాలే.. వాతావరణ శాఖ అలర్ట్‌

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఉరుములతో జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పింది.

Rains (Photo-Twitter)

Hyderabad, Nov 21: బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు (Rains) పడుతాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఉరుములతో జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈశాన్య దిశ నుంచి తెలంగాణ (Telangana) వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్‌లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.3డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.1 డిగ్రీలు, గాలిలో తేమ 41% నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Rains (Photo-Twitter)
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement