TSRTC MD Sajjanar Tweet: షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, రైలు డోర్ దగ్గర నిలబడిన యువతి, రెప్పపాటులో పక్కనుంచి ట్రైన్ రావడంతో షాక్
రైల్లో ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి డోర్ వద్ద నిల్చొని తల బయటకు పెట్టింది. క్షణాల్లోనే మరో రైలు పక్కనే ఉన్న పట్టాలపైకి రాగా.. వెంటనే ఇతర ప్రయాణికులు ఆ అమ్మాయిని లోపలికి లాగగా.. ప్రాణాలతో బయట పడింది.
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ వీడియో ట్వీట్ చేశారు. రైల్లో ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి డోర్ వద్ద నిల్చొని తల బయటకు పెట్టింది.
క్షణాల్లోనే మరో రైలు పక్కనే ఉన్న పట్టాలపైకి రాగా.. వెంటనే ఇతర ప్రయాణికులు ఆ అమ్మాయిని లోపలికి లాగగా.. ప్రాణాలతో బయట పడింది. అయితే ఈమె చాలా అదృష్టవంతురాలని, అందుకే రెప్పపాటు కాలంలో ప్రాణాలతో బయట పడిందంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రయాణం చేసేటప్పుడు సరదా కోసం ఇలాంటి పనులు అసలే చేయొద్దు. ఏమాత్రం తేడా జరిగిన ప్రాణాలకే ప్రమాదం.. జాగ్రత్త! అని సూచన చేశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)