TSRTC: వీసీ సజ్జనార్ మరో సంచలన నిర్ణయం, హైదరాబాద్ సిటీలో ఉచితంగా ప్రయాణం, 250 కిలోమీటర్ల పైన టికెట్ బుక్ చేసుకున్న వారికి తీపి కబురు చెప్పిన టీఎస్ఆర్టీసీ
250 కిలోమీటర్లపై ఉన్న సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు తీపి కబురు అందజేశారు. ఇలా సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు తమ ప్రాంతం నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కే ప్రాంతం వరకూ హైదరాబాద్ సిటీలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రకటించారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 250 కిలోమీటర్లపై ఉన్న సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు తీపి కబురు అందజేశారు. ఇలా సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు తమ ప్రాంతం నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కే ప్రాంతం వరకూ హైదరాబాద్ సిటీలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రకటించారు. హైదరాబాద్ జంట నగరాలలో ప్రయాణానికి 2 గంటల ముందు, ప్రయాణం తర్వాత 2 గంటల వరకూ ఈ ఆఫర్ వర్తిస్తుందని సజ్జనార్ ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం 040-30102829, 68153333 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)