Hyderabad: అమ్మాయి కోసం జూబ్లీహిల్స్ పబ్‌లో అర్థరాత్రి తన్నుకున్న రెండు వర్గాలు, గొడవలో ఏపీ మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ ఉన్నట్లుగా వార్తలు
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని జీరో పబ్ లో రాత్రి రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఇది అమ్మాయి కోసం జరిగిన గ్యాంగ్ వార్ గా తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని జీరో పబ్ లో రాత్రి రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఇది అమ్మాయి కోసం జరిగిన గ్యాంగ్ వార్ గా తెలుస్తోంది. ఇందులో ఓ గ్యాంగ్‌కు ఏపీ మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్, మరో గ్యాంగ్ కు యువకుడు సిద్ధార్థ మాగ్నమ్ నేతృత్వం వహించినట్లు సమాచారం. మార్టన్ ఫైటర్స్ అని పేరు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అమ్మాయి కోసం పబ్ లో వీరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఎదెరుదురుగా రావడంతో ఫైటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
బయటకు వచ్చి మద్యం మత్తులో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం. ఈ ఘటనలో సిద్ధార్థ, డేవిడ్ కు గాయాలయ్యాయి. దాడుల గురించి సమాచారం అందడంతో జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఇరు వర్గాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సిద్ధార్థకు తీవ్రగాయాలయ్యాయి. డేవిడ్ సవాంగ్‌కు కూడా గాయలు అయినట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ దాడిలో సిద్ధార్థ మాగ్నమ్ కన్నుపోయే పరిస్థితి ఏర్పడింది
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)