Beware Of Strangers On Social Media: స్నేహం, ప్రేమ ముసుగులో బూచోళ్లు..అమ్మాయిలు జాగ్రత్త, వీసీ సజ్జనార్ హెచ్చరిక..వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవద్దని సూచన
రోజురోజుకు సోషల్ మీడియాలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు(Beware Of Strangers On Social Media). ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(Sajjanar) కీలక సూచన చేశారు.
రోజురోజుకు సోషల్ మీడియాలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు(Beware Of Strangers On Social Media). ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(Sajjanar) కీలక సూచన చేశారు. అమ్మాయిలు... సోషల్ మీడియా బూచోళ్లతో జాగ్రత్త! అంటే ఓ పేపర్‌లో వచ్చిన కథనాన్ని ఎక్స్ ద్వారా షేర్ చేశారు సజ్జనారు.
స్నేహం, ప్రేమ ముసుగులో నమ్మించి వంచిస్తున్నారు... సోషల్ మీడియా వేదికల్లో గుడ్డిగా అజ్ఞాత వ్యక్తులను ఫాలో కాకండి(Social Media Friend Requests). ఫ్రెండ్ రిక్వెస్ట్ లను అంగీకరించకండన్నారు. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలను, ఫోటోలు, వీడియోలను అసలే షేర్ చేయకండని సూచించారు. స్నేహం, ప్రేమ ముసుగులో కామాంధులు, నేరస్థులు ఉండొచ్చు.. బీ కేర్ ఫుల్! అంటే అలెర్ట్ చేశారు సజ్జనార్.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యువకుల కార్ రేసింగ్.. స్టంట్‌లతో హంగామా చేసిన యువకులు, వీడియో ఇదిగో
ఇక మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు మీద కార్ రేసింగులు నిర్వహించారు యువకులు . తెల్లవారుజామున శంషాబాద్ ఔటర్ లో కార్ స్టంట్ చేస్తున్నారు యువకులు. నిర్మానుషంగా ఉన్న ప్రాంతాల్లో స్టంట్ లు చేస్తూ హంగామా సృష్టించారు . నడిరోడ్డుపైనే లక్జరీ కార్లతో స్టంట్ లు చేయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
VC Sajjanar says Beware Of Strangers On Social Media
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)