Vikas Raj New CEO of TS: తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా వికాస్‌రాజ్‌, ఉత్త‌ర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

మొన్న‌టిదాకా ఆ పోస్టులో కొన‌సాగిన శ‌శాంక్ గోయ‌ల్ ఇదివ‌ర‌కే బ‌దిలీ కాగా.. తాజాగా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్‌ను తెలంగాణ రాష్ట్రఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా నియ‌మిస్తూ కేంద్ర ఎన్నిల సంఘం బుధ‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Election Commission of India. File Image. (Photo Credits: PTI)

తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి (సీఈఓ) పోస్టు గ‌త కొంత కాలంగా ఖాళీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మొన్న‌టిదాకా ఆ పోస్టులో కొన‌సాగిన శ‌శాంక్ గోయ‌ల్ ఇదివ‌ర‌కే బ‌దిలీ కాగా.. తాజాగా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్‌ను తెలంగాణ రాష్ట్రఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా నియ‌మిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధ‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వికాస్ రాజ్‌.. ఉమ్మ‌డి ఏపీలో క‌ర్నూలు క‌లెక్టర్‌గా, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఎండీగా కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్టారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ కేడ‌ర్‌ను ఎంచుకున్న ఆయ‌న ఇన్నాళ్లూ సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ (జీఏడీ) ముఖ్య కార్య‌ద‌ర్శిగా కొన‌సాగారు.

Vikas Raj appointed the New CEO of Telangana

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

Fashion Tips For Women: ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఫంక్షన్లో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారో తెలుసుకుందాం.

KTR On Rythu Bharosa: రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్

Road Accidents in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు.. రెండు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం.. నల్గొండ జిల్లా దేవరకొండలో ముగ్గురు.. స‌త్య‌సాయి జిల్లాలో నలుగురు మృతి

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif