Viral Video: చెరువులో చేపల కోసమని వేసిన వలలో మొసలి లభ్యం, గద్వాల జిల్లాలో షాక్ తిన్న మత్య్సకారులు వీడియో చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం..
జోగుళాంబ గద్వాల జిల్లాలోని కేటిదొడ్డి మండలం వెంకటాపురం గ్రామంలో మొసలి కలకలం సృష్టించింది. వెంకటాపురం గ్రామంలో ఉన్న చెరువులో చేపల కోసమని వేసిన వలలో మొసలి లభ్యం అయ్యింది. దీంతో గ్రామస్థులు షాక్ కు గురయ్యారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని కేటిదొడ్డి మండలం వెంకటాపురం గ్రామంలో మొసలి కలకలం సృష్టించింది. వెంకటాపురం గ్రామంలో ఉన్న చెరువులో చేపల కోసమని వేసిన వలలో మొసలి లభ్యం అయ్యింది. దీంతో గ్రామస్థులు షాక్ కు గురయ్యారు. అనంతరం అటవీ శాఖ అధికారులు వచ్చి మొసలిని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండగా, జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 23 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది . శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 808.9 అడుగులు. జూరాలకు 40 వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. జూరాల పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 8.750 టీఎంసీలు కాగా 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు . ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలోని మూడు యూనిట్లలో 117 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది . దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో మూడు యూనిట్లలో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది .
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)