Passenger Falls from Train: వీడియో ఇదిగో, రన్నింగ్ ట్రైన్ దిగుతూ కిందపడ్డ ప్రయాణికుడు, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఘటన
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రమాదం తృటిలో తప్పింది. కదులుతున్న రైలు పూర్తిగా ఆగకముందే ప్లాట్‌ఫాంపైకి దిగేందుకు ప్రయత్నించిన ఒక ప్రయాణికుడు అదుపు తప్పి రైల్వే ట్రాక్ వైపు జారిపోయాడు.
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రమాదం తృటిలో తప్పింది. కదులుతున్న రైలు పూర్తిగా ఆగకముందే ప్లాట్‌ఫాంపైకి దిగేందుకు ప్రయత్నించిన ఒక ప్రయాణికుడు అదుపు తప్పి రైల్వే ట్రాక్ వైపు జారిపోయాడు. రైలు–ప్లాట్‌ఫాం మధ్య ఖాళీలో చిక్కుకున్న అతడిని చూసిన రైల్వే రక్షణ బలగాల (RPF) కానిస్టేబుల్ పంకజ్ కుమార్ శర్మ వెంటనే స్పందించి అతడిని లాగి బయటకు తీశాడు. అతని అప్రమత్తత వల్ల ఘోర ప్రమాదం తప్పించింది.
ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన ప్రయాణికుడిని రక్షించిన పంకజ్ కుమార్ శర్మను అధికారులు ప్రశంసించారు.కదులుతున్న రైళ్లలో ఎక్కడం లేదా దిగడం అత్యంత ప్రమాదకరమని, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచించారు.
Passenger Falls from Train:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)