Warangal Police: షాకింగ్ వీడియో.. భారీ వర్షంలో మొండిగా కారు నడిపిన డ్రైవర్, అందరూ చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయిన కారు, నీటి ప్రవాహం తక్కువగా ఉందని అంచనా వేయవద్దని పోలీసులు హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎక్కడికక్కడే నదులు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాదకర స్థాయిలో అవి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు తమ ప్రయాణం సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి వరంగల్ పోలీసులు హెచ్చరికతో కూడిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు

Tragedy Video in Twitter

తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎక్కడికక్కడే నదులు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాదకర స్థాయిలో అవి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు తమ ప్రయాణం సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి వరంగల్ పోలీసులు హెచ్చరికతో కూడిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నా ఓ వ్యక్తి తన కారును బ్రిడ్జి మీద నుంచి పోనిచ్చాడు. కారు మధ్యలోకి వెళ్లేసరికి ప్రవాహ వేగానికి ఆ కారు నదిలో కొట్టుకుపోయింది. ఈ వీడియోని షేర్ చేస్తూ నీటి ప్రవాహం తక్కువగా ఉందని అంచనా వేయవద్దని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement