CM Revanth Reddy on English: గుంటూరు, గుడివాడ వెళ్లి కార్పోరేట్ స్కూళ్లలో చదవలేదు, తనకు ఇంగ్లీష్ రాదనే వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్

తనకు ఇంగ్లిష్ రాదని కొంతమంది ఎగతాళి చేస్తున్నారని... కానీ తాను ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివి... ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

CM Revanth Reddy Anumula (photo-TS CMO)

తనకు ఇంగ్లిష్ రాదని కొంతమంది ఎగతాళి చేస్తున్నారని... కానీ తాను ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివి... ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లెక్చరర్లు, టీచర్ల ఉద్యోగాలకు ఎంపికైన 5,192 మందికి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం మూడు నెలల్లోనే 30వేల మందికి నియామక పత్రాలను అందించిందన్నారు. రైతును రాజుగా చేసే పాలనకు నాంది పడింది ఈ ఎల్బీ స్టేడియంలోనే అన్నారు.

తాను జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్నానని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. గుంటూరు, గుడివాడకు వెళ్లి కార్పోరేట్ స్కూళ్లలో చదవలేదని చురక అంటించారు. గత ప్రభుత్వం వేలాది గురుకులాలు నిర్మించామని గొప్పగా చెప్పుకుందని... కానీ ఒక్క శాశ్వత భవనం లేదని విమర్శించారు. వసతులు లేక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారు చేపలు, గొర్రెలు, బర్రెలు మాత్రమే పెంచాలన్నట్లుగా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. రేషనలైజేషన్ పేరిట కేసీఆర్ ఆరు వేల పాఠశాలలను మూసివేశారని మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.150 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓబీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ ఒకే క్యాంపస్‌లో ఒక యూనివర్సిటీ మోడల్‌లో నిర్మిస్తున్నట్లు తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement