Woman Gang Raped in Hyderabad: తార్నాకలో మహిళపై అర్థరాత్రి గ్యాంగ్‌రేప్‌, లిఫ్ట్ ఇస్తానంటూ నమ్మబలికి దారుణానికి తెగబడిన కామాంధులు

తార్నాకలో లిఫ్ట్‌​ పేరిట ఒక మహిళపై ఐదుగురు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. నిందితుల అరెస్ట్‌తో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లాలాగూడ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్‌ 7వ తేదీ అర్ధరాత్రి సమయంలో మహిళను తార్నాకలో వదిలిపెడతానంటూ మధు అనే వ్యక్తి నమ్మబలికాడు.

Assault (Image used for representational purpose only) (Photo Credits: ANI)

తార్నాకలో లిఫ్ట్‌​ పేరిట ఒక మహిళపై ఐదుగురు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. నిందితుల అరెస్ట్‌తో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లాలాగూడ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్‌ 7వ తేదీ అర్ధరాత్రి సమయంలో మహిళను తార్నాకలో వదిలిపెడతానంటూ మధు అనే వ్యక్తి నమ్మబలికాడు. తన స్కూటీపై ఎక్కించుకుని ప్రశాంత్‌నగర్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఫోన్‌ చేసి తన నలుగురు స్నేహితుల్ని రప్పించుకుని ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో మధు యాదవ్‌, బర్నా యేసు, సిరిగిరి ప్రశాంత్‌కుమార్‌, పస్తం తరుణ్‌కుమార్‌, కేశోజువా రోహిత్‌లపై కేసు నమోదు చేసుకున్నారు లాలాగూడ పోలీసులు. ప్రశాంత్.. మధుసూదన్.. రోహిత్ తరుణ్ అనే ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now