Hyderabad: షాకింగ్ వీడియో ఇదిగో..రోడ్డు మీద తెరచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిన చిన్నారి, తల్లి అప్రమత్తతో ప్రాణాలతో బయటకు.. హైదరాబాద్‌లోని యాకుత్‌పురా ప్రాంతంలో ఘటన
హైదరాబాద్‌లోని యాకుత్‌పురా ప్రాంతంలో ఓ ఆరేళ్ల చిన్నారి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. రోడ్డు మీద తెరచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిన చిన్నారిని ఆమె తల్లి వెంటనే గమనించి సురక్షితంగా బయటకు తీసింది. ఈ ఘటన ఆరేళ్ల బాలిక తన తల్లి, సోదరితో కలిసి స్కూల్‌కు వెళ్తున్న సమయంలో జరిగింది.
హైదరాబాద్‌లోని యాకుత్‌పురా ప్రాంతంలో ఓ ఆరేళ్ల చిన్నారి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. రోడ్డు మీద తెరచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిన చిన్నారిని ఆమె తల్లి వెంటనే గమనించి సురక్షితంగా బయటకు తీసింది. ఈ ఘటన ఆరేళ్ల బాలిక తన తల్లి, సోదరితో కలిసి స్కూల్‌కు వెళ్తున్న సమయంలో జరిగింది. చిన్నారి రోడ్డుపై ముందుగా నడుస్తుండగా, తెరచి ఉన్న మ్యాన్‌హోల్‌ను గమనించక పోవడంతో..ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. అయితే వెనక నడిచే ఆమె తల్లి వెంటనే అలర్ట్ అయి ఆ చిన్నారిని అందులో నుంచి బయటకు తీసింది. దీంతో బాలిక ప్రాణాలతో బయటపడింది.
స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రాంతం తరచూ రద్దీగా ఉండటం, మ్యాన్‌హోల్ మూతను తెరిచి ఉంచడం వలన ఇది ప్రమాదకరంగా మారిందని వారు సూచిస్తున్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులే ఇలాంటి నేర నిర్లక్ష్యానికి కారణమవుతున్నారని ప్రశ్నిస్తున్నారు. నిత్యం రద్దీ ఉన్న ప్రాంతాల్లో రోడ్డు భద్రతను పెంచడం, మ్యాన్‌హోల్ మూతలను సక్రమంగా ఉంచడం అత్యవసరమని వారు అంటున్నారు. రోడ్డు పాదచారులు, ప్రత్యేకించి చిన్నారులు, ఇలాంటి రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన చెబుతోంది.
6-Year-Old Girl Narrowly Escapes Manhole Accident in Yakutpura
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)