Viveka Murder Case: వివేకా హత్య కేసుపై స్పందించిన షర్మిల, మా చిన్నాన్నది ఆస్తి కోసం జరిగిన హత్య కాదని వెల్లడి

బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వివేకా పేరుపై ఉన్న ఆస్తులన్నీ ఎప్పుడో సునీత పేరు మీదే రాశారని తెలిపారు. ఆస్తులన్నీ ఎప్పట్నుంచో సునీత పేరు మీదే ఉన్నాయి. సునీత పేర ఆస్తులన్నీ ఉంటే వేరే వారికి రాస్తారనడంలో అర్థమే లేదు.

YSR Telangana Party Founder YS Sharmila. (Photo Credits: Twitter)

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఆస్తులపై వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వివేకా పేరుపై ఉన్న ఆస్తులన్నీ ఎప్పుడో సునీత పేరు మీదే రాశారని తెలిపారు. ఆస్తులన్నీ ఎప్పట్నుంచో సునీత పేరు మీదే ఉన్నాయి. సునీత పేర ఆస్తులన్నీ ఉంటే వేరే వారికి రాస్తారనడంలో అర్థమే లేదు.

ఆస్తుల కోసమే వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి హత్య చేశారనుకుంటే చంపాల్సింది.. వివేకాను కాదు సునీతను. మా చిన్నాన్న పేరిట ఉన్న అరకొర ఆస్తులూ సునీత పిల్లలకే రాశారని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నాయి. మా చిన్నాన్న పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. ఆయనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని షర్మిల చెప్పారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)