YS Sharmila Arrest: పోలీసులతో వైఎస్ విజయమ్మ వాగ్వాదం, వైఎస్‌ షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారని మండిపాటు, బలవంతంగా కారులో ఎక్కించి అక్కడి నుంచి వెనక్కిపంపిన పోలీసులు

వైటీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఆమె తల్లి విజయమ్మ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ వద్దకు వెళ్లారు. పీఎస్‌లోకి పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులకు విజయమ్మకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

YS vijayamma (Photo-ANI)

వైటీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఆమె తల్లి విజయమ్మ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ వద్దకు వెళ్లారు. పీఎస్‌లోకి పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులకు విజయమ్మకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిరుద్యోగుల కోసం షర్మిల పోరాడుతోందని.. ఆమెను ఎందుకు అరెస్ట్‌ చేశారని విజయమ్మ ప్రశ్నించారు. ప్రజల కోసం పోరాడే గొంతుకను అరెస్ట్‌ చేస్తారా? అని నిలదీశారు.

పోలీసులకు చేతనైన పని షర్మిలను అరెస్ట్ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. షర్మిలపై బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదైందని పోలీసులు విజయమ్మకు సూచించారు. అనంతరం పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించి అక్కడి నుంచి వెనక్కి పంపారు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement