5G Call Tested: దేశంలో 5జీ విప్లవం, 5జీ టెస్ట్ కాల్ విజయవంతం, ఐఐటీ మద్రాస్‌లో పరీక్షించిన కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, సంవత్సరం చివరి నాటికి అందుబాటులోకి..
ఐఐటీ మద్రాస్‌లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం 5జీ విజయవంతంగా టెస్ట్ కాల్ చేశారు. నెట్‌వర్క్ భారత్‌లో తొలిసారిగా అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. ‘ఐఐటీ మద్రాస్‌లో 5జీ కాల్ విజయవంతంగా పరీక్షించామని, ఎండ్ టూ ఎండ్ నెట్‌వర్క్‌ను భారత్‌లో రూపొందించడంతో పాటు అభివృద్ధి చేశాం’ అంటూ కేంద్రమంత్రి కూ యాప్‌లో పోస్ట్ చేశారు.
దేశంలో 5జీ విప్లవం రాబోతోంది. ఐఐటీ మద్రాస్‌లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం 5జీ విజయవంతంగా టెస్ట్ కాల్ చేశారు. నెట్‌వర్క్ భారత్‌లో తొలిసారిగా అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. ‘ఐఐటీ మద్రాస్‌లో 5జీ కాల్ విజయవంతంగా పరీక్షించామని, ఎండ్ టూ ఎండ్ నెట్‌వర్క్‌ను భారత్‌లో రూపొందించడంతో పాటు అభివృద్ధి చేశాం’ అంటూ కేంద్రమంత్రి కూ యాప్‌లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో టెలికమ్యూనికేషన్స్ విభాగం 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రతిపాదనను వచ్చే వారం తుది ఆమోదం కోసం కేంద్ర కేంద్ర కేబినెట్ ముందుంచే అవకాశం ఉన్నది. 5జీ సేవలు సంవత్సరం చివరి నాటికి అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.