Aadhaar PVC Card: ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్, ఇకపై ఆ ఆధార్ కార్డుల కాపీలు చెల్లవు, ఆధార్ ఏజెన్సీ నుంచి ఆర్డర్ చేసుకోవాలంటూ ట్వీట్ చేసిన యుఐడీఏఐ
ఆధార్ కార్డు వినియోగదారులకు యుఐడీఏఐ షాక్ ఇచ్చింది. భద్రత రక్షణలు లేకపోవడం వల్ల బహిరంగ మార్కెట్లో తయారు చేస్తున్న పీవీసీ ఆధార్ కాపీలను ఉపయోగించడాన్ని యుఐడీఏఐ నిషేదించింది. బయటి మార్కెట్లో తయారు చేస్తున్న నకిలీ పీవీసీ కార్డులను ఉపయోగించడం మంచిది కాదని పేర్కొంది.
ఆధార్ కార్డు వినియోగదారులకు యుఐడీఏఐ షాక్ ఇచ్చింది. భద్రత రక్షణలు లేకపోవడం వల్ల బహిరంగ మార్కెట్లో తయారు చేస్తున్న పీవీసీ ఆధార్ కాపీలను ఉపయోగించడాన్ని యుఐడీఏఐ నిషేదించింది. బయటి మార్కెట్లో తయారు చేస్తున్న నకిలీ పీవీసీ కార్డులను ఉపయోగించడం మంచిది కాదని పేర్కొంది. అలాంటి పీవీసీ కార్డ్‌లు ఎలాంటి సెక్యూరిటీ లేదా సెక్యూరిటీ ఫీచర్‌లను కలిగి ఉండవని తెలిపింది. కాబట్టి మీరు ప్రింటెడ్ పీవీసీ ఆధార్ కార్డ్‌ని తీసుకోకండి. అలాగే, పీవీసీ ఆధార్ కార్డు కావాలంటే రూ.50 చెల్లించి ప్రభుత్వ ఆధార్ ఏజెన్సీ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చని యూఐడీఏఐ ట్వీట్‌లో పేర్కొంది. ఆర్డర్ కోసం లింక్ కూడా యుఐడీఏఐ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. మీరు క్రింది లింక్ ద్వారా ఆధార్ కార్డు ఆర్డర్ చేసుకోవచ్చు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)