Alphabet Layoffs: ఆగని ఉద్యోగాల కోత, 137 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న గూగుల్‌ ఆల్ఫాబెట్‌ Waymo

టెక్ కంపెనీల్లో లే ఆఫ్స్ ఆగడం లేదు. తాజాగా ఆల్ఫాబెట్‌ Waymo (వేమో) ఉద్యోగుల్ని ఇంటికి పంపించింది. కాస్ట్‌ కటింగ్‌లో భాగంగా ఆల్ఫాబెట్‌.. వేమోలో 8 శాతం వర్క్‌ ఫోర్స్‌ను తగ్గించేందుకు సిద్ధమైంది. 2వ విడత ఉద్యోగుల లేఆఫ్స్‌తో ఆ సంస్థలో 137 మంది ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడనుంది.

Layoffs Representative Image (Photo Credit: Pixabay)

టెక్ కంపెనీల్లో లే ఆఫ్స్ ఆగడం లేదు. తాజాగా ఆల్ఫాబెట్‌ Waymo (వేమో) ఉద్యోగుల్ని ఇంటికి పంపించింది. కాస్ట్‌ కటింగ్‌లో భాగంగా ఆల్ఫాబెట్‌.. వేమోలో 8 శాతం వర్క్‌ ఫోర్స్‌ను తగ్గించేందుకు సిద్ధమైంది. 2వ విడత ఉద్యోగుల లేఆఫ్స్‌తో ఆ సంస్థలో 137 మంది ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడనుంది. కమర్షియల్‌ అంశాలపై దృష్టిసారించిన ఆల్ఫాబెట్‌ ఈ ఏడాది ఇప్పటి వరకు వేమోకు చెందిన 209 మంది ఉద్యోగులపై వేటు వేసింది. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌.. ‘వేమో’ పేరుతో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల ప్రాజెక్ట్‌పై పనిచేస్తుంది. ఆల్ఫాబెట్‌ ఇప్పటికే గూగుల్‌ ఉద్యోగులకు భారీ ఎత్తున పింక్‌స్లిప్‌లు జారీ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో 12వేల మందిని ఫైర్‌ చేయగా.. వారిలో భారత్‌కు చెందిన 400మంది ఉద్యోగులు ఉన్నారు.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement