Byju’s Layoffs:  మళ్లీ లేఆఫ్స్ క‌ల‌క‌లం, 3500 మంది ఉద్యోగులను తీసేస్తున్న బైజూస్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం

నూత‌న భార‌త సీఈవో సార‌ధ్యంలో పునర్వ్య‌వ‌స్ధీక‌ర‌ణ‌లో భాగంగా కంపెనీ మ‌రో విడ‌త ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజా లేఆఫ్స్‌ ద్వారా 3500 మంది ఉద్యోగుల‌పై వేటు ప‌డ‌నుందని చెబుతున్నారు.

BYJU'S (Photo Credits : File Photos)

ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ లేఆప్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. నూత‌న భార‌త సీఈవో సార‌ధ్యంలో పునర్వ్య‌వ‌స్ధీక‌ర‌ణ‌లో భాగంగా కంపెనీ మ‌రో విడ‌త ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజా లేఆఫ్స్‌ ద్వారా 3500 మంది ఉద్యోగుల‌పై వేటు ప‌డ‌నుందని చెబుతున్నారు.కంపెనీ ఇండియ‌న్ న్యూ సీఈవో అర్జున్ మోహ‌న్ నియామ‌కం అనంత‌రం తాజా లేఆఫ్స్ తెరపైకి వ‌చ్చాయి. ఈ లేఆఫ్స్‌లో సామ‌ర్ధ్యం అంచ‌నాల‌ను అందుకోలేని ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల‌పైనా వేటు ప‌డ‌నుంద‌ని సమాచారం.బైజూస్ పేరెంట్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్‌పై లేఆఫ్స్ ప్ర‌భావం ప‌డ‌నుండ‌గా, ఆకాష్ ఇనిస్టిట్యూట్ ఉద్యోగుల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని చెబుతున్నారు. సేల్స్, మార్కెటింగ్ స‌హా ప‌లు ఇత‌ర విభాగాల్లోనూ కొలువుల కోత ఉంటుంది.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)