'The Bird Is Freed': పూర్తయిన డీల్, ట్విట్టర్ పిట్టకు విముక్తి లభించిందంటూ వైరల్ ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్, రాగానే సంచలన నిర్ణయం తీసుకున్న టెస్లా అధినేత

గత కొన్నాళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ వచ్చిన ట్విటర్‌ డీల్‌ ఎట్టకేలకు పూర్తయింది. 44 బిలియన్‌ డాలర్లకు బిలియనీర్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ సొంతమైంది. దీంతో ట్విటర్‌ బర్డ్‌ మస్క్‌ గూటికి చేరింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి స్పందిస్తూ ‘ద బర్డ్‌ ఈజ్‌ ఫ్రీడ్‌’ అంటూ మస్క్‌ ట్వీ ట్‌ చేశారు.

Elon Musk & Twitter (File Photo)

గత కొన్నాళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ వచ్చిన ట్విటర్‌ డీల్‌ ఎట్టకేలకు పూర్తయింది. 44 బిలియన్‌ డాలర్లకు బిలియనీర్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ సొంతమైంది. దీంతో ట్విటర్‌ బర్డ్‌ మస్క్‌ గూటికి చేరింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి స్పందిస్తూ ‘ద బర్డ్‌ ఈజ్‌ ఫ్రీడ్‌’ అంటూ మస్క్‌ ట్వీ ట్‌ చేశారు. అంటే నకిలీ ఖాతాలకు తావులేకుండా, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలగకుండా యూజర్లకు అనుమతిస్తాననే సంకేతాలిచ్చారు.

దీంతో ఈ ట్వీట్‌ లైక్‌లు, కమెంట్స్‌, రీట్వీట్లతో మోస్ట్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే దీనిపై నెటిజన్ల రియాక్షన్లు విభిన్నంగా ఉండటం గమనార్హం. ట్విటర్‌ బాస్‌గా మస్క్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్వీటర్‌ సీఈవో పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్,లీగల్ అఫైర్స్ అండ్ పాలసీ చీఫ్ విజయ గద్దెపై వేటు వేశారని వాషింగ్టన్‌ పోస్ట్‌ నివేదించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now