Intel Layoffs: ఆగని లేఆప్స్, 100 మంది ఉద్యోగులను తొలగించిన ఇంటెల్, ఖర్చులు తగ్గించుకునేందుకు వ్యూహం

అమెరిక‌న్ చిప్‌మేక‌ర్ ఇంటెల్ (Intel layoffs) వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఏకంగా వంద మంది ఉద్యోగుల‌ను తొల‌గించింది. న‌ష్టాలు ఎదుర‌వ‌డంతో లేఆఫ్స్‌కు దిగుతున్న‌ట్టు ఈ ఏడాది మేలో ఇంటెల్ ప్ర‌క‌టించింది.

Intel (Photo Credits : Wikipedia)

అమెరిక‌న్ చిప్‌మేక‌ర్ ఇంటెల్ (Intel layoffs) వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఏకంగా వంద మంది ఉద్యోగుల‌ను తొల‌గించింది. న‌ష్టాలు ఎదుర‌వ‌డంతో లేఆఫ్స్‌కు దిగుతున్న‌ట్టు ఈ ఏడాది మేలో ఇంటెల్ ప్ర‌క‌టించింది.స్ధూల ఆర్ధిక వాతావ‌ర‌ణం ప్ర‌తికూలంగా ఉండ‌టంతో తమ వ్యూహాల‌ను వేగ‌వంతం చేస్తున్న‌ట్టు కంపెనీ తెలిపింది. దీర్ఘ‌కాల వృద్ధి కోసం పెట్టుబ‌డులు కొన‌సాగిస్తామ‌ని పేర్కొంది. అయితే ఎంత‌మంది ఉద్యోగుల‌పై వేటు వేస్తున్న‌ట్టు ఇంటెల్ స్ప‌ష్టం చేయ‌లేదు.

ఇక ఇంటెల్ లేటెస్ట్ లేఆఫ్స్ విష‌యానికి వ‌స్తే జీపీయూ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్‌, సిస్ట‌మ్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్‌, ప్రోడ‌క్ట్ మార్కెటింగ్ స‌హా ప‌లు విభాగాల్లో ఉద్యోగుల‌పై కంపెనీ వేటు వేసింది. కాగా అమెరికాలోని ఫాల్స‌న్ ఆర్అండ్‌డీ క్యాంప‌స్‌లో 89 మంది ఉద్యోగులు. శాన్‌జోన్, కాలిఫోర్నియాలో ప‌నిచేసే 51 మంది ఉద్యోగుల‌ను విధుల నుంచి ఇంటెల్ త‌ప్పించ‌నుంది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement