Paytm Layoffs: పేటీఎంలో మరోసారి ఉద్యోగాల కోత, వెయ్యిమందికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న వన్‌ 97 కమ్మూనికేషన్‌

పేటీఎంలోని వివిధ విభాగాల్లో సుమారు 1,000 మందికిపైగా ఉద్యోగులను (employees) తొలగించింది

Paytm (Photo-X)

ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం మాతృసంస్థ అయిన ‘వన్‌ 97 కమ్మూనికేషన్‌’ (One 97 Communications)లో వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. పేటీఎంలోని వివిధ విభాగాల్లో సుమారు 1,000 మందికిపైగా ఉద్యోగులను (employees) తొలగించింది. ఈ తొలగింపు ప్రభావం పేమెంట్స్‌, సేల్స్‌, ఆపరేషన్స్‌ వంటి విభాగాలపై పడింది. ఈ తొలగింపు మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం మందిని ప్రభావితం చేయనుంది.

సిబ్బంది ఖర్చులను 15 శాతం మేర తగ్గించడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. Paytm 2021లో 4,081 మంది ఉద్యోగులను కలిగి ఉంది, 2022లో 20,000 మంది మరియు 2023 మొదటి మూడు త్రైమాసికాల్లో 28,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కాగా సేల్స్, AI ఇంటిగ్రేషన్‌లో 50,000 మందిని నియమించుకుంటున్నట్లు ప్రకటనల మధ్య, Paytm ఖర్చు తగ్గించడంలో భాగంగా 1,000 మంది ఉద్యోగులను తొలగించింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)