Phone Unlocking with Breath: ఫింగర్ ప్రింట్, ఐరిస్ తో కాదు.. ఇకపై శ్వాసతోనే ఫోన్ అన్ లాక్
అయితే, మనిషి తీసుకునే శ్వాసతోనూ ఫోన్ అన్ లాక్ చేసే దిశగా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు ఐఐటీ మద్రాస్ సైంటిస్టులు.
Chennai, Jan 30: ఫింగర్ ప్రింట్ (Finger Print), ఐరిస్ ద్వారా ఫోన్ అన్ లాక్ (Phone Unlock) చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మనిషి తీసుకునే శ్వాసతోనూ (Breath) ఫోన్ అన్ లాక్ చేసే దిశగా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు ఐఐటీ మద్రాస్ సైంటిస్టులు. ఈ బ్రీతింగ్ టెక్నాలజీని ప్రాక్టికల్ అప్లికేషన్లుగా అభివృద్ధి చేశాక, సెల్ ఫోన్ అన్ లాక్ సహా భద్రతాపరమైన కార్యకలాపాల కోసం వాడొచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. 94 మంది నుంచి వివిధ రకాలుగా శ్వాసకు సంబంధించి శాంపిల్స్ తీసుకొని, అల్గారిథంను రూపొందించారు. వీటితో మనిషిని గుర్తించేందుకు జరిపిన పరీక్షల్లో 97శాతం సక్సెస్ అయ్యామని సైంటిస్టులు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)